షాహిద్‌తో సేతుపతి డిజిటల్ ఎంట్రీ

by  |

దిశ, వెబ్‌డెస్క్: హ్యాండ్సమ్ హంక్ షాహిద్ కపూర్ వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇదే క్రమంలో ‘జెర్సీ’ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తోన్న షాహిద్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని బీటౌన్ టాక్. మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్న వెబ్ సిరీస్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా జాయిన్ కాబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా లెవల్‌లో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేలా వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన రాజ్ అండ్ డీకే.. పాపులర్ సెలెబ్రిటీ కోసం వెతుకుతూ సేతుపతిని ఎంచుకున్నారట. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌ కంటెంట్ కూడా ఇంటెన్సివ్‌గా ఉండడంతో ఇందులో నటించేందుకు మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.

షాహిద్, సేతుపతి ఇద్దరు కూడా ఈ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతుండగా.. ఇంతకు ముందు కనిపించని పవర్‌ఫుల్ రోల్స్‌లో కనిపించబోతున్నారని టాక్. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటుండగా.. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ముంబై, గోవా ప్రాంతాల్లో రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి కానున్న సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed