సేతుపతితో కత్రిన రొమాన్స్?

by  |
సేతుపతితో కత్రిన రొమాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ స్టార్ విజయ్ సేతుపతి బాలీవుడ్‌ను కూడా ఏలే చాన్స్ మరెంతో దూరంలో లేదనిపిస్తుంది. సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ బాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుండగా.. కొత్తగా ‘అందాధున్’ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్‌లో పెట్టాడనే న్యూస్ వైరల్ అయింది. అందాధున్ తర్వాత శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఈ సినిమా కూడా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లిస్ట్‌లో చేరిపోయింది. మరో సూపర్ న్యూస్ ఏంటంటే సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ ఫైనల్ కావడం. ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ప్రస్తుతం సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ సినిమా కంప్లీట్ చేయగా.. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో షాహిద్ కపూర్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్, విక్రాంత్ మాస్సీతో కలిసి సంతోష్ శివన్ డైరెక్షన్‌లో ‘ముంబైకర్’ సినిమా అనౌన్స్ చేశాడు.


Next Story

Most Viewed