‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ లో విజయ్ సేతుపతి..?

by  |
viajy-sethupathi 1
X

దిశ, సినిమా : ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫ్రాంచైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. సెకండ్ సీజన్‌ సక్సెస్‌తో ఆ క్రేజ్ కాస్తా డబుల్ అయిపోయింది. సౌత్ స్టార్ సమంత రాజీగా తన యాక్టింగ్ స్కిల్స్‌తో పాపులారిటీ సంపాదించగా.. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ ఎప్పటిలాగే మెప్పించారు. తమిళ్ మిలిటెంట్స్, టెర్రరిస్ట్‌లు కలిసి ఇండియాలో బాంబ్ బ్లాస్టింగ్‌కు ప్లాన్ చేయడం స్టోరీ లైన్ కాగా.. ఎక్కువ భాగం చెన్నైలోనే షూటింగ్ జరిగింది. ఈ క్రమంలో ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకే, మనోజ్ బాజ్‌పాయ్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని కలిశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ముందుగా సెకండ్ సీజన్‌లో శ్రీలంకన్ మిలిటెంట్ గ్రూప్ లీడర్ భాస్కరన్ పాత్ర కోసం సేతుపతిని అప్రోచ్ కాగా.. దీన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన మిమ్‌గోపిని రిఫర్ చేశారని తెలిపారు. అయితే థర్డ్ సీజన్‌లో ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు బెస్ట్ క్యారెక్టర్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. అందుకోసమే మేకర్స్ తనను కలిశారని కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజమో తెలియదు కానీ కోల్‌కతాను సెంటర్‌గా చేసుకుని చైనా భారత్‌లో కరోనా వ్యాప్తికి ఎలాంటి ప్లాన్ చేసిందనేది థర్డ్ పార్ట్‌లో ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

Next Story