విజయ్ మాల్యా కేసుపై సుప్రీంకోర్టు అల్టిమేటమ్!

by  |
vijay malya
X

దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాంకులకు వేల కోట్ల రుణాలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లండన్ నుంచి విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే అంశంలో వేచి ఉండేందుకు అవకాశం లేదని, ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2017లో దోషిగా తేలిన విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో తుది విచారణను 2022, జనవరి 18న చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు తేల్చేసింది. 2017లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ. 300 కోట్లకు పైగా) బదిలీ చేసి ఆదేశాలను ఉల్లంఘించారు.

ఈ కేసులో విజయ్ మాల్యా దోషిగా తేలారు. దీనికి సంబంధించి గత నాలుగు నెలలుగా శిక్ష ఖరారు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇకమీదట వేచి ఉండే పరిస్థితి లేదని, అవసరం అనుకుంటే అఫిడఫిట్లను సమర్పించేందుకు అవకాశం ఉంటుందని, ప్రత్యక్షంగా హాజరు కాకపోతే తన తరపు న్యాయవాది ద్వారానైనా సమర్పించాలని వెల్లడించింది.


Next Story

Most Viewed