అమెజాన్‌ ప్రైమ్‌తో స్టార్ హీరోల ఒప్పందం

by  |
devarakonda
X

దిశ, సినిమా : స్టార్ హీరోస్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లు అమెజాన్ ప్రైమ్‌తో చేతులు కలిపారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘గాడ్జిల్లా వర్సెస్ కింగ్’ యానిమేటెడ్ వీడియో ‘లెజెండ్స్ ఆఫ్ ది మాన్‌స్టర్‌వర్స్’కు ప్రాంతీయ భాషల్లో న్యరేషన్ ఇచ్చారు. విజయ్ తెలుగులో స్టోరీని న్యరేట్ చేయగా.. దుల్కర్ తమిళ్‌లో కథను ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. రెండు ప్రాణాంతక రాక్షసులు గాడ్జిల్లా, కాంగ్‌ల మధ్య పోటీ, ఇతిహాసం గురించి ఈ వీడియోలో వివరించగా అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. ‘మీ బీస్ట్ బాయ్ ‘లెజెండ్స్ ఆఫ్ ది మాన్‌స్టర్‌వర్స్’ న్యరేటర్‌గా వస్తున్నాడు.. గాడ్జిల్లా వర్సెస్ కింగ్, ప్రైమ్‌తో ఫన్ కొలాబొరేషన్’ అని విజయ్ వీడియో షేర్ చేయగా.. ‘‘గాడ్జిల్లా వర్సెస్ కింగ్’ మాన్‌స్టర్‌వర్స్ పురాణ పోటీని వివరించేందుకు అమెజాన్ ప్రైమ్‌తో కొలాబొరేట్ అయ్యాను. తమిళ్‌లో చూడండి’ అంటూ దుల్కర్ అభిమానులతో వీడియోను పంచుకున్నాడు.


Next Story

Most Viewed