- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్, పూరి ‘లైగర్’.. బాక్సర్‌గా ఇంటెన్స్ లుక్
<p>దిశ, వెబ్‌డెస్క్: సినిమా నిర్మాణంలో లయన్ లాంటి ధర్మ ప్రొడక్షన్స్, టైగర్ లాంటి పూరి కనెక్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లైగర్’. లయన్, టైగర్ క్రాస్ బ్రీడ్ ‘లైగర్’ అంటూ టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్..ఫస్ట్ లుక్ రీవీల్ చేశారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ చాలా కొత్తగా ఉండగా..రౌడీ హీరో విజయ్ దేవరకొండను సరికొత్త అవతార్ లో చూపించారు. లాంగ్ హెయిర్, పవర్ ఫుల్ లుక్స్, చేతికి గ్లౌజేస్‌తో గర్జిస్తున్నట్లు కనిపిస్తున్న విజయ్‌ను […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సినిమా నిర్మాణంలో లయన్ లాంటి ధర్మ ప్రొడక్షన్స్, టైగర్ లాంటి పూరి కనెక్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లైగర్’. లయన్, టైగర్ క్రాస్ బ్రీడ్ ‘లైగర్’ అంటూ టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్..ఫస్ట్ లుక్ రీవీల్ చేశారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ చాలా కొత్తగా ఉండగా..రౌడీ హీరో విజయ్ దేవరకొండను సరికొత్త అవతార్ లో చూపించారు. లాంగ్ హెయిర్, పవర్ ఫుల్ లుక్స్, చేతికి గ్లౌజేస్‌తో గర్జిస్తున్నట్లు కనిపిస్తున్న విజయ్‌ను బాక్సర్‌గా ఇంటెన్స్ లుక్‌లో చూపిస్తూ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
టాలీవుడ్‌లో తనదైన మార్క్‌తో ప్రేక్షకులకు దగ్గరైన విజయ్..ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ప్రెస్టీజియస్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్‌లో కావడం గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు విజయ్. తన లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఎవరూ కూడా ఇంత గొప్ప స్టేజ్‌కు చేరుకోవడం నిజంగా అసాధ్యమేనని..కానీ, మ్యాడ్‌నెస్, పాషన్, హార్డ్‌వర్క్ తనను ఇక్కడకు చేర్చాయన్నారు. తన లాంటి ప్రతీ ఒక్కరూ పెద్దగా కలలు కనడం..సాధ్యం అవుతాయని నమ్మడం..అది జరిగేలా చేయడం మంచిదే అని అభిప్రాయడ్డారు.
కరణ్ జోహార్, చార్మి, అపూర్వ మెహతా, హిరు యశ్ జోహార్ నిర్మిస్తున్న ‘లైగర్’కు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకులు. అనన్య పాండే ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. రమ్య కృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న సినిమాలో రోనిత్ రాయ్, విషురెడ్డి, ఆలి, గెటప్ శీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ ఒక్క అనౌన్స్‌మెంట్‌తోనే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెంచేసిన పూరి, విజయ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్.
Humbly announcing our arrival Pan India!
Nation wide madness Guaranteed.
Produced by @KaranJohar @DharmaMovies @Charmmeofficial @PuriConnects
A @purijagan Film!#LIGER#SaalaCrossBreed pic.twitter.com/GWrLKuLrJu
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18, 2021






