- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ భారీ విరాళం.. ఏపీ, తెలంగాణకు సహాయం
<p>కోలీవుడ్ హీరో విజయ్… కరోనా పై పోరాటానికి తన వంతు సహాయం ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్ తో పాటు పలు రాష్ట్రాలకు తన వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తన సొంత రాష్ట్రం తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు సహాయం అందిస్తూ… ప్రశంసలు అందుకున్నాడు. కాగా విజయ్… తన సొంత రాష్ట్రం తమిళనాడుకు రూ. 50 లక్షలు ప్రకటించి.. పీఎం కేర్స్ ఫండ్ కు రూ. 30 లక్షలు విరాళం అందిస్తున్నట్లు వెల్లడించాడు. కేరళ సీఎం […]</p>

కోలీవుడ్ హీరో విజయ్… కరోనా పై పోరాటానికి తన వంతు సహాయం ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్ తో పాటు పలు రాష్ట్రాలకు తన వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తన సొంత రాష్ట్రం తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు సహాయం అందిస్తూ… ప్రశంసలు అందుకున్నాడు.
కాగా విజయ్… తన సొంత రాష్ట్రం తమిళనాడుకు రూ. 50 లక్షలు ప్రకటించి.. పీఎం కేర్స్ ఫండ్ కు రూ. 30 లక్షలు విరాళం అందిస్తున్నట్లు వెల్లడించాడు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 10 లక్షల సహాయం ప్రకటించిన ఆయన…. తెలంగాణ, ఏపి, కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రి సహాయమిధికి రూ. 5 లక్షల చొప్పున విరాళం అందిస్తున్నట్లు తెలిపారు.
సినిమా పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న సినీ వర్కర్స్ లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయారు. కరోనా మహమ్మారి కారణంగా బతుకు చీకటై… సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికోసం ఫెఫ్సీకి రూ. 25 లక్షల విరాళం అందించారు విజయ్.
Tags: Vijay, Kollywood, CoronaVirus, Corona, Covid19






