నయన్‌ సెలెక్షన్‌తో గర్వపడుతున్నా : విఘ్నేష్ శివన్

by  |
నయన్‌ సెలెక్షన్‌తో గర్వపడుతున్నా : విఘ్నేష్ శివన్
X

దిశ, వెబ్‌డెస్క్ : మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, లేడీ సూపర్‌స్టార్ నయనతార కలిసి మరో అరుదైన మూవీని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. పీఎస్ వినోద్ రాజ్‌ను దర్శకుడిగా పరిచయంచేస్తూ ‘కులాంగల్’ సినిమాను నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు విఘ్నేష్. సినిమాల నిర్మాణం, సమర్పణ విషయంలో యూనిక్ స్టోరీస్‌ సెలెక్ట్ చేస్తున్న నయన్‌ను చూస్తుంటే ప్రౌడ్‌గా ఉందన్నారు.

కొన్ని సినిమాలతో అసోసియేట్ అయినప్పుడు ఒక ప్రౌడ్‌ ఫీలింగ్ వస్తుందన్న విఘ్నేష్.. ‘కులాంగల్’ మూవీని చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతే కలిగిందని చెప్పాడు. ఈ సినిమా టైటిల్(గులకరాయి) లాగే, కథ కూడా సింపుల్‌గా ఉన్నా.. ప్రేక్షకుల మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త నటులు, టెక్నీషియన్ల పర్ఫార్మెన్స్.. ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేయడం మాత్రమే కాదు, యువన్ శంకర్‌రాజా అందించిన మ్యూజిక్ మనసులను మెలిపెడుతుందన్నారు. అలాంటి అనుభవమే సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలన్న ఎగ్జైట్‌మెంట్‌ను‌ పెంచేసిందన్నారు శివన్. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తామని తెలిపారు.



Next Story

Most Viewed