పెళ్లై బికినీ వేసుకొంటే విడాకులే.. మొన్న సమంత.. మరి నీకెప్పుడు..?

326

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న సమంత- చైతన్య ల విడాకుల మాటే వినిపిస్తోంది. నాలుగేళ్ల అన్యోన్య కాపురానికి స్వస్తి పలుకుతూ వారిద్దరూ విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే సామ్ విడాకులకు కారణం ఆమె వస్త్రధారణే అని, పెళ్లి తర్వాత కూడా ఆమె  బోల్డ్ ఫొటో షూట్స్ చేయడం, బోల్డ్ పాత్రలకు ఒప్పుకోవడమే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా సామ్ విషయంలో జరిగిన పొరపాటును కొంతమంది నెటిజన్లు అందరి తారలకు అనువదిస్తున్నారు. పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ అయినా బోల్డ్ గా డ్రెస్ వేసుకొంటే వారికి కూడా సామ్ లానే విడాకులు అవుతాయని జోస్యం చెప్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితిని టాలీవుడ్ టాప్ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.

తెలుగు, తమిళ్ లో మంచి కమెడియన్  గుర్తింపు  తెచ్చుకున్న విద్యుల్లేఖ రామన్ కరోనా సమయంలో ఇరవై కేజీలు బరువు తగ్గి నాజూకుగా తయారయ్యింది. ఆ తరువాత ఆమె న్యూట్రిషన్ నే ప్రేమించి పెళ్లి చేసుకొంది. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే బరువు ఉన్నప్పుడు చేయని స్కిన్ షో ను అమ్మడు బరువు తగ్గాకా విహార యాత్రలో అందాలను ఆరబోస్తోంది. ఇటీవల విద్యుల్లేఖ  సాగర తీరాన బికినీ లో హాట్ పోజ్ ఇచ్చి అటు అభిమానులను, ఇటు నెటిజన్లను షాక్ కి గురిచేసింది. కొంతమంది బరువు తగ్గి హాట్ స్కిన్ షో కి రెడీ అంటోంది హీరోయిన్ అవకాశాల కోసమేనా అని అంటుండగా.. మరికొందరు పెళ్లి తర్వాత  ఇలాంటి డ్రెస్సులు వేసుకోబట్టే విడాకులు అవుతున్నాయి.. మరి మీ విడాకులెప్పుడు..? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక వీటిపై స్పందించిన కమెడియన్ “1920 నుంచి బయటకొచ్చి 2021లోకి రండి. సమాజంలోని ఆలోచనా ధోరణే అసలైన సమస్య. ఒకవేళ మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే… చక్కగా దుస్తులు ధరించిన వాళ్లందరూ సంతోషకరమైన వైవాహిక జీవితాల్లో ఉన్నారా?.. నా భర్త సంజయ్ మంచి వాడు.. మనసున్న వాడు.. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం.. అన్ని తెలిసి ఇలా మాట్లాడే సంకుచిత వ్యక్తిత్వం ఉన్నవారిని నేను మార్చలేను.. అంటూ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంటే సామ్ డ్రెస్సింగ్ ని బట్టే చై విడాకులు ఇచ్చాడా..? అంటూ ఇంకొంతమంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..