- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాచ్ మధ్యలో అలా చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.. నెట్టింట వీడియో వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. అయితే, గురువారం మొదటి రోజు మ్యాచ్‌లో భారత బ్యాట్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో అదరగొట్టి భారత్‌కు మంచి స్కోర్ అందించారు. అయితే, భారత బ్యాటింగ్‌ను క్రీడాభిమానులందరూ ఆశక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను తిలకించడానికి వచ్చిన ఓ క్రీడాభిమాని స్టాండ్స్‌లో కూర్చొని ‘గుట్కా’ నమలుతూ ఫోన్‌లో మాట్లాడుతూ అందరి దృష్టి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. అయితే, గురువారం మొదటి రోజు మ్యాచ్‌లో భారత బ్యాట్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో అదరగొట్టి భారత్‌కు మంచి స్కోర్ అందించారు. అయితే, భారత బ్యాటింగ్‌ను క్రీడాభిమానులందరూ ఆశక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను తిలకించడానికి వచ్చిన ఓ క్రీడాభిమాని స్టాండ్స్‌లో కూర్చొని ‘గుట్కా’ నమలుతూ ఫోన్‌లో మాట్లాడుతూ అందరి దృష్టి తనపై తిప్పుకున్నాడు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాకుండా.. ఈ వీడియో మీమర్స్‌కి మంచి స్టఫ్ కూడా అయింది. మాజీ భారత బ్యాటర్ వసీమ్ జాఫర్ వంటి ప్రముఖులు కూడా అతని గురించి ట్విట్టర్‌లో మీమ్‌లను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని కాన్పూర్‌లోని మహేశ్వరి మహోల్‌లో నివసించే షోబిత్ పాండేగా గుర్తించారు. అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను తింటున్నది గుట్కా కాదు, తమలపాకని స్పష్టం చేశాడు. అంతేకాకుండా తనతో పాటు ఉన్న తన సోదరిపై నెటిజన్స్ చేస్తున్న అసహ్యకరమైన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయని చెప్పాడు.
#Video of man-eating gutkha in stands in Kanpur during the first Test goes viral. #WATCH #INDvNZ #KanpurTest #Kanpur #Gutkha #NZvIND #IndiaVsNewZealand #ShreyasIyer #RavindraJadeja pic.twitter.com/xNt4ihDUPd
— Amazing info hub (@Amazinginfohub1) November 26, 2021






