కాళ్లు, చేతులు లేకున్నా.. రాణిస్తున్న ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌

by  |
కాళ్లు, చేతులు లేకున్నా.. రాణిస్తున్న ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌
X

దిశ, ఫీచర్స్: కొందరు పిల్లలు పుట్టుకతోనే అవయవ లోపాన్ని కలిగి ఉంటారు. అలాంటి పిల్లల్ని పెంచుకునేందుకు ఇష్టపడని కొంతమంది పేరెంట్స్ వారిని అనాథశ్రమంలో వదిలేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు ఇలాంటి బాధను అనుభవిస్తున్నారు. గేబ్ ఆడమ్స్-వీట్లీ కూడా ఆ దు:ఖాన్ని చవిచూసినవాడే. హన్హార్ట్ సిండ్రోమ్ కారణంగా చేతులు, కాళ్లు లేకుండా జన్మించిన అతన్ని తల్లిందండ్రులు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లారు. అయితే లోపం అవయవాలకే గానీ తనలో ప్రయత్నలోపం లేదంటూ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగాడు ఆడమ్స్. పనులన్నీ సొంతంగా చేసుకునే తను.. మేకప్ ట్యుటోరియల్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తున్న ఆడమ్స్.

ఆ విశేషాలు మీకోసం..

ఫ్యాషన్ ఫీల్డ్‌లో సోషల్ మీడియా వేదికగా ప్రభావితం చేసే వారికి కొరత లేదు. హెవీ కాంపిటీషన్ గల ఈ స్ట్రీమ్‌లో సత్తా చాటుతున్న గేబ్ ఆడమ్స్ చాలా మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా తన వీడియోలను పోస్ట్ చేసే ఆడమ్స్.. ఇప్పటికే లక్షలాది మందిని ఆకట్టుకోగా ఇటీవల వైరల్‌గా మారిన తన మేకప్ వీడియోలో బ్లాక్ షీర్ డ్రెస్ ధరించి గ్లామరస్ మేకోవర్ ఇచ్చాడు. తన నైపుణ్యాలకు గాను సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు.

హాన్‌హార్ట్ సిండ్రోమ్‌తో బ్రెజిల్‌లోని సావోపాలోలో జన్మించిన 22 ఏళ్ల ‘గేబ్ ఆడమ్స్-వీట్లీ’ని అతని తల్లిదండ్రులు పుట్టిన వెంటనే ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. అయితే యునైటెడ్ స్టేట్స్‌‌కు చెందిన దంపతులు చిన్నతనంలోనే తనను దత్తత తీసుకోవడంతో ఆడమ్స్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అన్ని విధాలా ప్రోత్సహించే కుటుంబం, తన హృదయం కోరుకునే అన్ని విషయాలను కొనసాగించేందుకు అవకాశాన్ని అందించింది.

https://www.instagram.com/reel/CTYgr2ynuXL/?utm_source=ig_web_copy_link


Next Story