- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రమ్యను చంపడం తప్పే..నా కొడుకును శిక్షించండి: శశికృష్ణ తల్లి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: బీటెక్ విద్యార్థిని రమ్యను హత్యపై ముద్దాయి శశికృష్ణ తల్లి స్పందించారు. ఒక అమ్మాయి ప్రాణం తీయడం తన కొడుకు చేసిన పెద్ద తప్పు అని ఆమె అన్నారు. తన కొడుకు చేసిన పనికి తగిన శిక్ష పడాల్సిందేనని చెప్పారు. తనకు ఎవరి బిడ్డ అయినా ఒకటేనని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తాను చాలా బాధపడ్డానని తెలిపింది. మృతురాలు రమ్యకు, తన కుమారుడికి ఉన్న పరిచయం గురించి తనకు తెలియదని ఆమె […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: బీటెక్ విద్యార్థిని రమ్యను హత్యపై ముద్దాయి శశికృష్ణ తల్లి స్పందించారు. ఒక అమ్మాయి ప్రాణం తీయడం తన కొడుకు చేసిన పెద్ద తప్పు అని ఆమె అన్నారు. తన కొడుకు చేసిన పనికి తగిన శిక్ష పడాల్సిందేనని చెప్పారు. తనకు ఎవరి బిడ్డ అయినా ఒకటేనని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తాను చాలా బాధపడ్డానని తెలిపింది. మృతురాలు రమ్యకు, తన కుమారుడికి ఉన్న పరిచయం గురించి తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. అయితే శశికృష్ణ గత కొన్ని రోజులుగా తీవ్రంగా బాధపడుతున్నాడని.. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడని చెప్పుకొచ్చారు. రమ్యను హత్య చేయడాన్ని తాను ఖండిస్తున్నానని తన కొడుకు శశికృష్ణకు తగిన శిక్ష పడాల్సిందేనని ముద్దాయి తల్లి వ్యాఖ్యానించారు.
Next Story






