నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన

by Shyam |

<p>దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‌‎లో నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌ వెల్లడించారు. వెంకయ్యనాయుడు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బేగంపేట ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, కేబీఆర్‌ జంక్షన్‌, జూబ్లీచెక్‌పోస్ట్‌, రోడ్‌ నెంబర్‌ 45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీదుగా నానక్‌రాంగూడ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా నిలిపివేయడం [&hellip;]</p>

నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన
X

దిశ, వెబ్‎డెస్క్:
హైదరాబాద్‌‎లో నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌ వెల్లడించారు.

వెంకయ్యనాయుడు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బేగంపేట ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, కేబీఆర్‌ జంక్షన్‌, జూబ్లీచెక్‌పోస్ట్‌, రోడ్‌ నెంబర్‌ 45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీదుగా నానక్‌రాంగూడ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Next Story