- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా భార్యకు కరోనా.. స్టిల్ ఐయామ్ హ్యాపీ! : వెంకయ్య
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా బారి పడిన కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. తాను కోరోనా నుంచి కోలుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే, ప్రస్తుతం తన అర్ధాంగి ఉషకు సైతం కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయం పట్ల తాను ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. అది చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు.అయితే, వెంకయ్య ఆ పోస్టు పెట్టడానికి గల కారణాలను సైతం వివరించాడు. కరోనా వచ్చినా.. వెంకయ్య భార్య […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా బారి పడిన కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. తాను కోరోనా నుంచి కోలుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే, ప్రస్తుతం తన అర్ధాంగి ఉషకు సైతం కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయం పట్ల తాను ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. అది చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు.అయితే, వెంకయ్య ఆ పోస్టు పెట్టడానికి గల కారణాలను సైతం వివరించాడు.
కరోనా వచ్చినా.. వెంకయ్య భార్య ఎంతో గుండెనిబ్బరంతో ఉందని, ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని చెప్పారు. అంతేకాకుండా, తన కార్యాలయంలో పనిచేస్తూ కరోనా వైరస్ ప్రభావానికి గురైన మరో 13 మంది ఉద్యోగులు కూడా పూర్తిగా కోలుకోవడం పట్ల కూడా అంతే సంతోషిస్తున్నానని చెప్పారు. నా ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త తీసుకున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని తెలిపారు. వైద్య సిబ్బందికి, వేళకు సలహాలు అందిస్తూ నా ఆరోగ్యం కుదుటపడటానికి తోడ్పాటు అందించిన ఎయిమ్స్ నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, నాకోసం అహరిశ్నలు పనిచేసిన నా వ్యక్తిగత సిబ్బంది విక్రాంత్, చైతన్యలకు అభినందనలు అంటూ వెంకయ్య ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.






