టీఆర్ఎస్‌కు షాక్.. వేముల గుడ్ బై

290

దిశ, కామేపల్లి: కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి, ఉద్యమకారుడు వేముల వెంకటనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సరైన గుర్తింపు లేక ఉద్యమకారులను చిన్నచూపుగా చూడటం, ఈటల రాజేందర్ తో మంచి పరిచయాలు ఉండటంతో బీజేపీలో చేరారు. బుధవారం కామేపల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనకు ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు ఉందని, ఉద్యమకారుల్ని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుర్తించలేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ విఫలం చెందారని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ కి మంచి భవిష్యత్ ఉండడంతో బీజేపీలో చేరినట్లు తెలిపారు. మండల పరిధిలోని జాస్తిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుండి భారీగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని అన్నారు. త్వరలో ఈటల సమక్షంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.