పండుగ రోజు రాజకీయాలు వద్దు బాబు: వెల్లంపల్లి

45

దిశ, వెబ్‌డెస్క్: పండుగ పూట చంద్రబాబు అబద్ధాలు చెప్పొద్దని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలోని వెల్లంపల్లి ఇంటి ముందు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందరికీ భోగభాగ్యాలు అందాలన్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. సీఎం మంచోడైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందరికీ చేరాలని ఆకాంక్షించారు. అబద్ధాలు చెప్పే చంద్రబాబును నమ్మే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదన్నారు. భోగి రోజు కూడా రాజకీయాలు చేయడం చంద్రబాబు మానుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు.