సారాతో పనిచేస్తున్నానని వార్నింగ్ ఇచ్చారు: వరుణ్

by  |
సారాతో పనిచేస్తున్నానని వార్నింగ్ ఇచ్చారు: వరుణ్
X

దిశ, వెబ్‌‌డెస్క్: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ సారా అలీ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘కూలీ నెం.1’. సూపర్ స్టార్ గోవింద బ్లాక్ బస్టర్ మూవీ ‘కూలీ నెం.1’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మూవీ యూనిట్ కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ క్రమంలో వరుణ్..సారాను చూసి హీరోలు కూడా భయపడుతున్నారని, తనతో కలిసి వర్క్ చేస్తున్నావా? అయితే జాగ్రత్త అని పలు సూచనలు కూడా ఇచ్చారని చెప్పారు.

కూలీ నెం.1 కాస్ట్ అండ్ క్రూ అనౌన్స్ చేసిన వెంటనే విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్ మెస్సేజ్ చేశారని..సారాతో జాగ్రత్త అని సజెషన్స్ ఇచ్చారన్నాడు. కాగా, క్రిస్మస్ స్పెషల్‌గా రాబోతున్న కపిల్ శర్మ షో ప్రోమో ఫుల్ కామెడీతో నిండిపోగా ఆడియన్స్‌కు మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది.


Next Story

Most Viewed