వరుణ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్

by  |
వరుణ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‎డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, లేడీ లవ్ నటాషా దలాల్ వెడ్డింగ్ డేట్ లాక్ అయిపోయింది. జనవరి 24న అతికొద్ది మంది మిత్రులు, బంధువుల నడుమ గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని బీ టౌన్ టాక్. నేషనల్ మీడియా వివరాల ప్రకారం 40-50 మంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్‌ను లిస్ట్ ఔట్ చేసిన కపుల్స్.. జనవరి 22 నుంచి 25 వరకు తమకోసం డేట్స్ కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గెస్ట్‌లకు ఈ-ఇన్విటేషన్ కూడా సెండ్ చేసిన వరుణ్.. తప్పకుండా తమ హప్పియేస్ట్ మూమెంట్స్‌లో భాగం కావాలని ఇన్వైట్ చేశారట.

సౌత్ ముంబైలోని అలీ బాగ్ పెళ్లికి వేదిక అవుతుండగా.. బీచ్ ఫేస్డ్ రిసార్ట్ మొత్తం బుక్ చేశాడట వరుణ్. ఈ నెల 22 నుంచి 25 వరకు రిసార్ట్ బుక్ చేసిన వరుణ్.. ఈ నాలుగు రోజులు కూడా గెస్ట్‌లు అందరూ అక్కడే స్పెండ్ చేయాలని కోరారని సమాచారం. కాగా, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వరుణ్, నటాషా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. పలు టీవీ షోస్‌లో తమ లవ్ స్టోరీ గురించి వివరించాడు వరుణ్. సిక్స్త్ స్టాండర్డ్‌లో నటాషతో ఫ్రెండ్ షిప్ చేస్తున్న తను ట్వెల్త్ స్టాండర్డ్‌లో తనతో లవ్‌లో పడిపోయానని చెప్పాడు. తనతో డేటింగ్ చేశానని.. మేమిద్దరం కపుల్ అని ‘కాఫీ విత్ కరణ్’ షోలో నటాషతో రిలేషన్ గురించి రివీల్ చేసిన వరుణ్..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.


Next Story

Most Viewed