రాధికను ఎందుకు 'అమ్మ' అనాలి? : వరలక్ష్మి

by Shyam |

<p>వరలక్ష్మి శరత్ కుమార్.. తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందరిలా కేవలం హీరోయిన్‌ పాత్రలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉంటే చాలు ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు ఓకే చెప్పేస్తుంది. అందుకే వరలక్ష్మికి ఏ రోల్ ఇచ్చినా వంద శాతం న్యాయం చేయగలదు అని నమ్ముతారు దర్శక, నిర్మాతలు. ఇప్పటిదే 25 సినిమాలు పూర్తిచేసిన వరలక్ష్మి&#8230; మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్‌గా మారింది. తమిళ్ మూవీ &#8216;పోడా పోడి&#8217; చిత్రంతో పరిచయమైన ఈ భామ.. [&hellip;]</p>

రాధికను ఎందుకు అమ్మ అనాలి? : వరలక్ష్మి
X

వరలక్ష్మి శరత్ కుమార్.. తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందరిలా కేవలం హీరోయిన్‌ పాత్రలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉంటే చాలు ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు ఓకే చెప్పేస్తుంది. అందుకే వరలక్ష్మికి ఏ రోల్ ఇచ్చినా వంద శాతం న్యాయం చేయగలదు అని నమ్ముతారు దర్శక, నిర్మాతలు. ఇప్పటిదే 25 సినిమాలు పూర్తిచేసిన వరలక్ష్మి… మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్‌గా మారింది. తమిళ్ మూవీ ‘పోడా పోడి’ చిత్రంతో పరిచయమైన ఈ భామ.. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీ షెడ్యూల్‌లో ఉంది.

ఇదిలా ఉంటే వరలక్ష్మి తల్లితో విడాకులు తీసుకుని రాధికను రెండో పెళ్లిచేసుకున్నాడు శరత్ కుమార్. అయినా కూడా ఆమెతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యే వరలక్ష్మీ… రాధికను ఆంటీ అనే పిలుస్తుంది. ఈ ప్రశ్నే వరలక్ష్మికి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఔను తనను ఆంటీ అనే పిలుస్తాను.. ఎందుకంటే ఆమె మా అమ్మకాదు. అలాంటప్పుడు ఆంటీ అని పిలవడంలో తప్పేంటి అని నిర్మొహమాటంగా చెప్పింది. నాన్న, రాధిక ఆంటీ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను అంది. అంతేకాని అమ్మ అని మాత్రం పిలవలేను అని చెప్పేసింది.

Tags: Varalaxmi, Sharat Kumar, Radhika

Next Story