లేడీ విలన్ న్యూ బిజినెస్.. ‘లైఫ్ ఆఫ్ పై’

by  |
లేడీ విలన్ న్యూ బిజినెస్.. ‘లైఫ్ ఆఫ్ పై’
X

వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గానే కాకుండా లేడీ విలన్‌‌గానూ సూపర్ చాన్స్‌లు కొట్టేస్తోంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆఫర్లను అందుకుంటున్న వరు.. తాజాగా విడుదలైన అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా టీజర్‌లోనూ కనిపించింది. ఈ సినిమాలో లాయర్‌గా కనిపించనున్న తను.. చిత్రానికి కీలకం కానుందట.

ఇదిలా ఉంటే, లాక్‌డౌన్ టైమ్‌లో వలస కూలీలకు అన్నం పెట్టిన వరు.. అదే సమయంలో మూగ జీవాల ఆకలినీ తీర్చింది. కాగా లాక్‌డౌన్‌లో అధిక సమయం దొరకడంతో టైమ్ పాస్ కోసం ‘లైఫ్ ఆఫ్ పై’ అనే ఒక చిన్న బేకింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఫ్రెష్‌గా బేక్ చేసిన చీజ్ టార్ట్స్‌ను ఆర్డర్ మీద తయారు చేసి పంపిస్తోంది. అభిరుచిగా మొదలైన పని ప్రస్తుతం ఒక చిన్నపాటి బిజినెస్‌గా మారగా.. ఇప్పటి వరకు 100కు పైగా ఆర్డర్స్ వచ్చాయని తెలిపింది. తన మీద నమ్మకముంచి ఆర్డర్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ముందుగానే ఆర్డర్ చేయాల్సి ఉంటుందని చెప్తోంది వరు.

https://www.instagram.com/p/CCGJ4FyACYm/?igshid=16wsm7e4ur3y2


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed