మామ్ .. సూపర్ హీరో : వరు శరత్ కుమార్

by  |
మామ్ .. సూపర్ హీరో : వరు శరత్ కుమార్
X

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గా కంటే విలన్‌గా చాలా గుర్తింపు తెచ్చుకుంది. విలన్‌ క్యారెక్టర్‌లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన వరు.. లాక్ డౌన్ సమయంలో మంచి మనసున్న మనిషిగా ప్రజలకు పరిచయమైంది. కరోనా కష్ట సమయంలో తిండిలేక ప్రాణాలు విడుస్తున్న జంతువులకు తన తల్లి ఛాయాశరత్ కుమార్‌తో కలిసి ఆహారాన్ని అందించి శభాష్ అనిపించుకుంది. అన్నదానాలు, విరాళాలు కూడా అందించిన ఈ హీరోయిన్ కమ్ విలన్.. తన తల్లి చేస్తున్న సేవలు చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుందని చెబుతుంది. చెన్నై గుండా శ్రామిక్ రైలులో సొంత గ్రామాలకు ప్రయాణిస్తున్న వారికి ఆహారం అందించేందుకు తన తల్లి ఎంత కష్టపడిందో తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది.

ముగ్గురు వాలంటీర్లతో కలిసి 30 నిమిషాల్లో 20 కోచ్‌లున్న ట్రైన్‌లో ప్రయాణికులందరికీ బ్రెడ్ పంచిన అమ్మను చూస్తే గర్వంగా ఉందని తెలిపింది. 1,600 మంది ప్రయాణికుల ఆకలి తీర్చిన సూపర్ హీరో మా మామ్ అంటూ ప్రశంసించింది. ఈ సందర్భంగా సేవ్ శక్తి వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపిన వరు.. మీ సహకారం లేకుండా అతిథి కార్మికులకు సేవ చేయడం సాధ్యం కాకపోయి ఉండేదని చెప్పింది. అలాగే చెన్నై పోలీస్ యంత్రాంగం, చెన్నై కార్పోరేషన్, ఇండియన్ రైల్వేస్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Next Story

Most Viewed