ఎన్టీఆర్‌తో జయమ్మ?

by  |
ఎన్టీఆర్‌తో జయమ్మ?
X

దిశ వెబ్‌డెస్క్: తెలుగులో వరుస సినిమాలతో అదరగొడుతుంది వరలక్ష్మీ శరత్ కుమార్. మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన క్రాక్ సినిమాలో నెగిటివ్ రోల్‌లో జయమ్మ పాత్రలో అభిమానులను అలరించింది. నెగిటివ్ రోల్‌లో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక అల్లరి నరేష్ హీరోగా ఇటీవల విడుదలైన నాంది సినిమాలో కూడా లాయర్ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో తెలుగులో ఆమెకు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి.

ఇప్పుడు మరో తెలుగు సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మెరవనుంది.ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. నటీనటీలను ఎంపిక చేసే పనిలో మేకర్స్ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ RRRతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ క్రమంలో ఒక వార్త బయటికొచ్చింది. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ నాయకురాలి పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర పాజిటివ్‌గా ఉంటుందా?.. లేదా నెగిటివ్‌గా ఉంటుందా? అనే విషయం మాత్రం బయటికి రాలేదు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్దేని తీసుకోనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed