అజిత్ బర్త్‌డే కానుకగా ‘వాలిమై’ అప్‌డేట్

by  |
అజిత్ బర్త్‌డే కానుకగా ‘వాలిమై’ అప్‌డేట్
X

దిశ, సినిమా : తమిళ స్టార్ హీరో అజిత్‌(తలా)‌ సినిమా వస్తుందంటే చాలు.. ఆయన ఫ్యాన్స్‌కు పండగే. ప్రస్తుతం తను హెచ్. వినోద్‌ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తుండగా.. ఈ మూవీ అప్‌డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఇండియా-ఇంగ్లాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగానే కాక, భారత ప్రధాని మోదీ చెన్నై పర్యటించిన వేళ ‘వాలిమై’ అప్‌డేట్ గురించి చెప్పాలంటూ అజిత్ అభిమానులు ఫ్లకార్డ్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘వాలిమై’ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ‘అజిత్ యాభైవ(ఏకే 50) పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం’ అని నిర్మాత బోనీకపూర్ ట్వీట్ చేశాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా హ్యూమా ఖురేషీ నటిస్తుండగా, యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.



Next Story

Most Viewed