- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వాలిమై' ఫస్ట్ లుక్ : రేసర్ గా బరిలోకి దిగిన తాలా అజిత్
<p>దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సమయం వచ్చేసింది. రెండేళ్లుగా అజిత్ సినిమా ‘వాలిమై’ అప్ డేట్ కోసం అభిమానులు ఎంతగా ఆరాటపడుతున్నారో అందరికి తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సమయం వచ్చేసింది. రెండేళ్లుగా అజిత్ సినిమా ‘వాలిమై’ అప్ డేట్ కోసం అభిమానులు ఎంతగా ఆరాటపడుతున్నారో అందరికి తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్.
ఇక ఇటీవల కమల్ ‘విక్రమ్’, సూర్య ‘నవరస’ ప్రమోషన్లు స్టార్ట్ చేయడంతో అభిమానులు ‘వాలిమై’ అప్ డేట్ ఇవ్వాలని మేకర్స్ పై విరుచుకుపడడంతో ఎట్టకేలకు నేడు ‘వాలిమై’ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో తాలా అజిత్ రేసర్ లా అదరగొట్టాడు. ఈ ఫస్ట్ లుక్ మొత్తానికి తలా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. స్వతహాగానే అజిత్ బైక్ రేసర్ అని అందరికి తెలుసు.. ఇక ఈ చిత్రంలో ఆయన స్టంట్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ‘పవర్ ఈజ్ ఏ స్టేట్ అఫ్ మైండ్’ అనే టాగ్ లైన్ తో వాలిమై మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇక యువన్ శంకర్ రాజా మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవుందని తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ తో తాలా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.






