“వలస ముద్రలు”

637
Valasalu

నాగరికత తల ఎత్తుకున్నా,తల కిందులైనా
అక్కడే వలస మొదలౌతుంది
ఈ వలసలకు అలసటే ఉండదు

ఆనాటి భారత దేశ విభజన వలసకు
తలదన్నేదే ఈనాటి కరోనా వలస

రాష్ట్ర సరిహద్దులు మూసేసినా
ఈ వలస ముద్రలే
ప్రపంచానికి కొత్త బాటలు చూపాయి

గుండె దాటనివ్వని ఆకలి కేకలే
అరికాళ్ళలో మొలిచిన దేశ పటాన్ని
సరికొత్తగా పరిచయం చేసింది

నడకకి ఆవల ఉన్న ఆశే
మార్గం చూపని మానవదేహంపై
నెత్తుటి అడుగుల సంతకమైంది

వాదించినా, వారించినా
లాఠీలతో బాధించినా
కళేబరంగా మారినాసరే
కన్నవారిని కావలించుకోవడానికి
ఇనుప పాదాలతో కరోనాను మట్టికరిపిస్తూ
మట్టిలో చేరే ఒక్క క్షణం ముందైనా
కట్టుకున్నదాన్ని చేరి
క్షమించమని కోరడానికే
మంటల చైతన్యంలా ఎగిసిపడుతూ
ముందుకు పడుతున్నాయి వలస ముద్రలు
వచ్చే తరానికిదో న్యూ సిలబస్

నామాల రవీంద్రసూరి
9848321079

Namala Ravindra Soori