మామలను మించిన అల్లుడు.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ రికార్డ్

by  |
మామలను మించిన అల్లుడు.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ రికార్డ్
X

దిశ, సినిమా: మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేశాడు. ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఫస్ట్ డే రూ.10.42 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. భారీ ఓపెనింగ్స్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాడు. ఫస్ట్ డే ఫస్ట్ సినిమాకు భారీ కలెక్షన్స్ సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించాడు. ‘ఉప్పెన’ వరల్డ్ వైడ్ థియాట్రికల్ వాల్యూ రూ.20 కోట్ల ఉండగా..తొలి రోజే 50 శాతం కన్నా ఎక్కువగా రికవరీ పొందడం విశేషం. మొత్తానికి ఈ రికార్డుతో మామలను మించిన అల్లుడు అనిపించుకున్నాడు.

లాక్‌డౌన్ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి వంద శాతం యాక్యుపెన్సీతో థియేటర్స్ రన్ కావడం ‘ఉప్పెన’కు కలిసొచ్చింది. ఈ సినిమా బంపర్ హిట్‌తో థియేటర్ యాజమాన్యాలు హ్యాపీగా ఉన్నాయి. కరోనా కారణంగా నష్టపోయిన థియేటర్స్ యజమానులు..దాదాపు ఏడాది తర్వాత హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌ వస్తుండటంతో ఆనందంగా ఉన్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించిన ఉప్పెనలో వైష్ణవ్, కృతి శెట్టి జంట మెప్పించగా..దర్శకులు బుచ్చిబాబుకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చేసింది.



Next Story

Most Viewed