తృణమూల్ ఎమ్మెల్యేలకు టీకా

69

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ నేతలు టీకా పొందిన వార్తలు దుమారం రేపాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పర్బా బర్దమాన్ జిల్లాలో టీకా పొందారు. కాగా, పలువురు హెల్త్ వర్కర్లు తమకు టీకా అందలేదని ఆరోపణలు చేశారు. భతర్ స్టేట్ జనరల్ హాస్పిటల్‌లో తొలి టీకా ఎమ్మెల్యే సుభాశ్ మొండల్ వేసుకున్నారు. కత్వా సబ్ డివిజనల్ హాస్పిటల్‌లో మరో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ టీకా పొందారు. వీరితోపాటు టీఎంసీ మాజీ ఎమ్మెల్యే బనమాలి హజ్రా, ఇతర నేతలు జహర్ బగ్దీ, మహేంద్ర హజ్రాలూ టీకా పొందారు. కాగా, వీరంతా పలు హాస్పిటళ్లలో పేషెంట్స్ వెల్ఫేర్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని, తద్వారా టీకా పొందడానికి అర్హత కలిగి ఉన్నారని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..