టీచర్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ టెన్షన్

by  |
టీచర్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ టెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీచర్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ టెన్షన్ ప్రారంభమైంది. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు వైద్యశాఖ వ్యాక్సిన్ వేసింది. వీరిలో సాంకేతిక సమస్యలతో 5 శాతం మందికి సర్టిఫికెట్లు రాలేదని చెబుతున్నారు. ఇంకొందరికి ఫోన్లకు మెస్సెజ్‌లు కూడా రాలేదు. ఒకవేళ స్కూళ్లు ప్రారంభిస్తే తాము పాఠశాలల్లోకి ఎలా ప్రవేశించాలని పలువురు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళన చెందుతున్నారు.

అయితే వ్యాక్సిన్ వేసిన వారి డేటా తమ దగ్గర ఉందని, మెస్సెజ్, సర్టిఫికెట్లు రాని వారు తమను సంప్రదిస్తే ఆన్ లైన్‌లో ఎంట్రీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. లేదా కోవిన్ సాప్ట్ వేర్‌లోనూ స్వయంగా ఎన్ రోల్ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి ఇప్పటి వరకు సుమారు లక్ష మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యాక్సిన్ వేసుకోలేదని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. స్కూల్స్ తెరిచేలోపు వీరంతా టీకా పొందాలని అధికారులు సూచించారు.

స్కూల్స్ వారీగా వివరాలు ఇస్తే తమ టీంలు వచ్చి వ్యాక్సి్న్ అందివ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక ప్రతి 15 రోజులకోసారి టెస్టులు నిర్వహించేందుకు మొబైల్ టెస్టింగ్ వాహనాలను కూడా పాఠశాలలకు పంపించేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. పెద్దలంతా వ్యాక్సిన్ వేసుకోని, పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా కాపాడుకోవాలని అధికారులు కోరారు.



Next Story