ఉత్తరఖండ్ హైకోర్టు మూసివేత

by Shamantha N |

<p>డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లో కరోనా మహామ్మారి ఉదృతి పెరిగిపోతోంది. సోమవారం నుంచి డెహ్రాడూన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఇప్పటికే అధికారులు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్ర హైకోర్టు మూత‌పడనుంది. ఈ మేరకు హైకోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. మే2 వరకు హైకోర్టును మూసివేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. ఏవైనా కేసుల అత్యవసర హియరింగ్ కోసం దరఖాస్తులను కోర్టు రిజిస్టార్‌కు అప్పగించాలని వెల్లడించింది. కాగా [&hellip;]</p>

ఉత్తరఖండ్ హైకోర్టు మూసివేత
X

డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లో కరోనా మహామ్మారి ఉదృతి పెరిగిపోతోంది. సోమవారం నుంచి డెహ్రాడూన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఇప్పటికే అధికారులు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్ర హైకోర్టు మూత‌పడనుంది. ఈ మేరకు హైకోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. మే2 వరకు హైకోర్టును మూసివేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. ఏవైనా కేసుల అత్యవసర హియరింగ్ కోసం దరఖాస్తులను కోర్టు రిజిస్టార్‌కు అప్పగించాలని వెల్లడించింది. కాగా మే3 నుంచి కేసుల హియరింగ్ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరుగుతుందని సమాచారం.

Next Story