ఫంక్షన్‌లో మద్యం వద్దంటే రూ.పదివేలు ఇస్తారంటా!

by  |
ఫంక్షన్‌లో మద్యం వద్దంటే రూ.పదివేలు ఇస్తారంటా!
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా శుభకార్యాల్లో నాన్‌వెజ్, మద్యం తప్పనిసరి. ఈ రెండు లేకుంటే ఫంక్షన్స్‌ అనే మాటకు అర్థముండదు అనేది కొందరి వాదన. దేశంలో జరిగే అన్ని శుభకార్యాల్లో మద్యం సరఫరా ఓ ఫార్మాలిటీ అయిపోయింది. అయితే, కొన్ని సందర్భాల్లో లిక్కర్ అనేది గొడవలకు దారితీస్తోంది. ఫుల్‌గా మద్యం సేవించిన వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో తెలీదు. దీనివల్ల ఫంక్షన్లు ఆగిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఫంక్షన్లో మద్యం సరఫరా వద్దని నిర్ణయించిన వారికి రూ.10వేల బహుమానం అందజేస్తున్నారు.

తాజాగా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లా దేవ్‌ప్రయాగ్ పోలీసులు తమ శుభకార్యాల్లో మద్యం వద్దని నిర్ణయించుకున్న వధువులకు రూ.10,001 రివార్డు అందించారు. రివార్డ్ డబ్బును పోలీస్ స్టేషన్ సిబ్బంది పూల్ చేస్తారని దేవ్‌ప్రయాగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ రావత్ తెలిపారు. మద్యం వలన వివాహాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని, అలాంటి వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రావత్ వెల్లడించారు.


Next Story

Most Viewed