ఓపెనింగ్‌కూ పిలవలే.. ప్రొటోకాల్ పాటించట్లే: ఉత్తమ్

99

దిశ ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ, ఏపీల మధ్య చారిత్రాత్మక మట్టపల్లి వంతెనకు కాంగ్రెస్ హయాంలోనే రూ.50 కోట్లు మంజూరు చేశామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తన సొంత కృషి వల్లే బ్రిడ్జి సాధ్యమైందని, వంతెనతో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ది జరుగుతందని ఆయన చెప్పారు. మట్టపల్లి వంతెనను సందర్శించి మాట్లాడుతూ…. టోల్ టాక్స్ లేకుండా వాహనాలు నడిచే విధంగా ఈ వంతెనను రూపొందించామని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్రోచ్ రోడ్డును మాత్రమే మంజూరు చేసిందన్నారు. కనీసం ఈ వంతెన ఓపెనింగ్‌కు గౌరవప్రదమైన ఆహ్వానం అందలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని పేర్కొన్నారు. పార్లమెంట్ విధానాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని, స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రూ. వందల కోట్ల జాతీయ రహదారుల ఓపెనింగ్‌కు ఆహ్వానాలు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రొటోకాల్ అంశంపై అధికారులను హెచ్చరిస్తున్నామని చెప్పారు.