నన్ను బలవంతం చేయబోయారు.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by  |
urfi javed copy
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ హాట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో విమర్శలపాలవుతుంది. కానీ ఈసారి మాత్రం ప్రముఖ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్‌ గురించి రివీల్ చేసింది. ఇండస్ట్రీలో అందరి అమ్మాయిలలాగే తాను కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని తెలిపింది. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి నన్ను బలవంతం చేయబోయాడు. కానీ నేను అదృష్టవశాత్తు బయట పడ్డానని పేర్కొంది.

అంతే కాకుండా ఇండస్ట్రీకి చెందిన మరికొందరు ప్రముఖుల నుండి కూడా తాను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. అయితే ఆ ప్రముఖుల పేర్లు మాత్రం చెప్పనంది ఈ అందాల భామ. ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ అని, వారు అడిగింది కాదంటే వెంటనే అవకాశాలు రాకుండా చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. అలా కాదన్నందుకే నేను చాలా అవకాశాలు కోల్పోయానంటూ వాపోయింది.

అయితే అవేవీ నా జీవితంపై ప్రభావం చూపించలేదని ఉర్ఫీ తెలిపింది. కాగా ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఉర్ఫీ ఫేమస్ అవ్వడానికి తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒక కారణం. తన హాట్ హాట్ ఫొటోలతో నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఉర్ఫీ జావేద్.


Next Story

Most Viewed