ఐఏఎస్ టీనా దాబి.. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ టిప్స్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : ‘టీనా దాబి’.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(2015) పరీక్షలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించిన మహిళ. ప్రస్తుతం ఆమె రాజస్థాన్ క్యాడర్‌లో ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వరిస్తోంది. అతి చిన్నవయసులోనే ఐఏఎస్‌‌కు ఎంపికైన టీనా.. ఎంతోమంది ఐఏఎస్ అస్పిరెంట్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కాగా యూపీఎస్ ప్రిలిమ్స్ టాకిల్ చేయడానికి ఆమె తన స్టడీ ప్లాన్, స్ట్రాటజీలను వారితో పంచుకుంది. బి కన్సిస్టెంట్ : యూపీఎస్ పరీక్షలో లక్ష్యాన్ని సాధించే మార్గం సుదీర్ఘమైంది.. [&hellip;]</p>

ఐఏఎస్ టీనా దాబి.. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ టిప్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘టీనా దాబి’.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(2015) పరీక్షలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించిన మహిళ. ప్రస్తుతం ఆమె రాజస్థాన్ క్యాడర్‌లో ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వరిస్తోంది. అతి చిన్నవయసులోనే ఐఏఎస్‌‌కు ఎంపికైన టీనా.. ఎంతోమంది ఐఏఎస్ అస్పిరెంట్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కాగా యూపీఎస్ ప్రిలిమ్స్ టాకిల్ చేయడానికి ఆమె తన స్టడీ ప్లాన్, స్ట్రాటజీలను వారితో పంచుకుంది.

బి కన్సిస్టెంట్ :

యూపీఎస్ పరీక్షలో లక్ష్యాన్ని సాధించే మార్గం సుదీర్ఘమైంది.. కఠినమైంది కూడా. ఇందులో సక్సెస్ కావడానికి మనకున్న ఏకైక మార్గం ‘స్థిరంగా ఉండటమే’.చాలా మంది అస్పిరెంట్స్ ఓ సంవత్సరం పాటు ఎంతో కష్టపడతారు. కానీ ఆ తర్వాత మోటివేషన్ కోల్పోవడంతో పాటు, మొదట చూపిన ఫైర్ చూపక మెల్లిమెల్లిగా డైవర్ట్ అయిపోతుంటారు. మధ్యలోనే అలసిపోతే.. ఎప్పుడూ గమ్యాన్ని చేరుకోలేరు. ప్రతిక్షణం మనకు మనం మోటివేట్ అవుతూ.. సానుకూల దృక్పథంతో ముందుడుగు వేస్తేనే విజయం చేరువవుతుంది.

టార్గెట్ సెట్టింగ్ :

మొదలుపెట్టే ముందే మన టార్గెట్‌ను సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకు క్లియర్ గోల్ లేకపోతే.. హ్యూజ్ సిలబస్‌ను కవర్ చేయలేం. రోజుకు ఎన్ని గంటలు చదవాలి, వారానికి ఎంత సిలబస్ కవర్ చేయాలి? నెలలో ఎన్ని సబ్జెక్ట్ పూర్తి చేయాలి.. వంటి విషయాలు ఎవరికి వారు తమ శక్తిని బట్టి ప్లానింగ్ ప్రిపేర్ చేసుకుంటే.. విజయం సొంతమవుతుంది.

సమయ పాలన :

గంటలకొద్దీ పుస్తకాల ముందు కూర్చోవడం ముఖ్యం కాదు.. మ్యాటర్‌ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నామన్నదే ప్రధానం. టైమ్ స్లాట్స్ ప్రకారం చదవడంతో పాటు, బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కష్టమైన సబ్జెక్ట్‌కు మూడు గంటలు, కాస్త సులువైన వాటికి రెండు గంటలు కేటాయించడం ఉత్తమం. ఒక రోజు ఒకే సబ్జెక్ట్‌కు పరిమితం కాకుండా.. రెండు, మూడు చదివితే బోర్ కొట్టదు.

ప్రాక్టీస్ ఓ అలవాటుగా :

ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేవారికి రివైజ్ చేయడానికి కూడా ఎంతో సమయముంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్‌తో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించండి. ప్రతి వారంలో ఓ రోజు రివిజన్‌కు డెడికేట్ చేస్తే.. ఆ వారంలో చదివినవన్నీ కవర్ చేయొచ్చు. దాంతో పాటు పేపర్ అటెంప్ట్ చేయాలి. ఓ సిలబస్ కంప్లీట్ చేసిన పదిరోజుల్లోనే రివిజన్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఎంత రివైజ్ చేస్తే.. అంత ఉత్తమం. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఫలితం అన్నది గుర్తుంచుకోవాలి. రీడ్, రివైజ్, అటెంప్ట్ ఈ మూడు పర్‌ఫెక్ట్‌గా జరిగితే విజయం తప్పక సాధించవచ్చు.

ఇక ఎస్సే విషయానికి వస్తే.. ఇందులో చాలా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. కానీ చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ప్రిలిమ్స్ పూర్తి కాగానే, మెయిన్స్ ప్రిపేర్ అవుతూనే ప్రతి వారం ఓ ఎస్సే‌ను రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా చదవడం, డిఫరెంట్ స్టైల్స్‌లో రాయడం ప్రాక్టీస్ చేస్తే, వ్యాసాన్ని అందంగా రాయొచ్చు. ఆస్పిరెంట్స్ అందరూ ప్రిపరేషన్ సయమంలో నోట్స్ ప్రిపేర్ చేస్తుంటారు. ఆ సమయంలో ఎన్నో టాపిక్స్, డేటా పాయింట్స్ నోట్ చేస్తారు. అయితే ఆ డేటా పాయింట్స్‌‌ను కూడా ఓ వ్యాసంగా మలచొచ్చు. పరీక్షలో వ్యాసం రాసేముందు.. రెండు వ్యాసాలకు కలిపి ఓ అరగంట కేటాయించి, ఏం రాయాలనుకుంటున్నారో పాయింట్స్‌ నోట్ చేయండి. వ్యాసంలో సబ్ హెడ్డింగ్స్, డేటా పాయింట్స్, కోట్స్, మరిన్ని ముఖ్యమైన అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే.. 800 పదాల ఎస్సేను గంటలో అవలీలగా, అందంగా రాయొచ్చు.

ఎంతోమంది ఐఏఎస్ అధికారులతో పాటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ ‘ప్రిపరేషన్ టిప్స్’ అందిస్తారు. అయితే అందరి శక్తిసామర్థ్యాలు ఒకేలా ఉండవు. కావున అందులోని అంశాలను గమనించి, మన వేలో వాటిని మలచుకుని ప్రిపేర్ అయితే.. సక్సెస్ సొంతమవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏ దశలోనూ నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్లాలి.

Next Story