సివిల్స్ ఆస్పిరెంట్స్‌కు గుడ్ న్యూస్.. వారికి ఎంతో యూజ్‌ఫుల్

by Shamantha N |   (  Updated:2024-06-19 06:35:52  IST  )

<p>దిశ, ఫీచర్స్ : ప్రతీ సంవత్సరం విభిన్న ఆర్థిక, విద్యా నేపథ్యాలు గల అభ్యర్థులు యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవుతుంటారు. మార్కెట్‌లో స్టడీ మెటీరియల్స్, రిఫరెన్స్‌లు, ఆన్‌లైన్ పోర్టల్స్, యూట్యూబ్ వీడియోస్ విస్తారంగా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి, ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియక తర్జన భర్జనకు గురవుతుంటారు. అంతేకాదు సిలబస్ విషయంలో ఎదురయ్యే సందేహాలకు కలవరపడుతుంటారు. సివిల్స్‌కు సిద్ధమయ్యేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలో సరైన గైడెన్స్ అనేది కీలక పాత్ర పోషించనుండగా.. కోచింగ్ […]</p>

సివిల్స్ ఆస్పిరెంట్స్‌కు గుడ్ న్యూస్.. వారికి ఎంతో యూజ్‌ఫుల్
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ సంవత్సరం విభిన్న ఆర్థిక, విద్యా నేపథ్యాలు గల అభ్యర్థులు యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవుతుంటారు. మార్కెట్‌లో స్టడీ మెటీరియల్స్, రిఫరెన్స్‌లు, ఆన్‌లైన్ పోర్టల్స్, యూట్యూబ్ వీడియోస్ విస్తారంగా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి, ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియక తర్జన భర్జనకు గురవుతుంటారు. అంతేకాదు సిలబస్ విషయంలో ఎదురయ్యే సందేహాలకు కలవరపడుతుంటారు. సివిల్స్‌కు సిద్ధమయ్యేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలో సరైన గైడెన్స్ అనేది కీలక పాత్ర పోషించనుండగా.. కోచింగ్ ఫెసిలిటీ కూడా ఇందుకు దోహదపడుతుంది.

అయితే అభ్యర్థులందరికీ భారీ మొత్తంలో ట్యూషన్ ఫీజులు చెల్లించే స్థోమత ఉండకపోవచ్చు. అటువంటి ఆస్పిరెంట్స్ తమ డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు వీలుగా ఎన్నో ప్రైవేట్, ప్రభుత్వ ఆధ్వర్యంలో/నిధులతో నిర్వహిస్తున్న సంస్థలు ఫ్రీగా సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తున్నాయి. వీటిల్లో ప్రవేశం పొందేందుకు అర్హతా ప్రమాణాల్లో తేడాలున్నా.. కోచింగ్, గైడెన్స్‌ను అందరికీ అందుబాటులో ఉంచడమే ఈ సంస్థల లక్ష్యం. కాగా దేశవ్యాప్తంగా యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్‌ను ఉచితంగా అందిస్తున్న సంస్థల వివరాలు మీ కోసం..

జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ, న్యూ ఢిల్లీ

జామియా మిలియా ఇస్లామియా RCA.. సివిల్ సర్వీసెస్(ప్రిలిమినరీ-కమ్- మెయిన్) ప్రిపరేషన్ కోసం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు చెందిన మహిళా అభ్యర్థులు మొత్తంగా 200 మందికి హాస్టల్ ఫెసిలిటీ సహా ఫ్రీ కోచింగ్ కల్పిస్తోంది. ప్రవేశం పొందిన అభ్యర్థుల్లో 20 శాతం మందికి మెరిట్ ఆధారంగా నెలకు రూ.2000 చొప్పున స్కాలర్‌షిప్ కూడా అందిస్తోంది. కోచింగ్ నిమిత్తం ఆర్‌సీఏ.. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా జనవరి 2021లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్(మెయిన్స్) పరీక్షను ఆర్‌సీఏ, జేఎంఐకి చెందిన మొత్తం 34 మంది విద్యార్థులు క్లియర్ చేయడం విశేషం.

దరఖాస్తు : ఆసక్తిగల అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్-jmi.ac.in నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెరీర్స్, ముంబయి

రాష్ట్ర యువతను సివిల్ సర్వీసెస్ వైపు ప్రోత్సహించి, వారి ప్రతిభను మెరుగుపరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 1976లో స్టే్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కెరీర్స్(ఎస్‌ఐఏసీ)ని స్థాపించింది. మహారాష్ట్ర యువత సివిల్స్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్దమయ్యేందుకు ఈ సంస్థ హాస్టల్ ఫెసిలిటీతో సంవత్సరం పొడవునా ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

దరఖాస్తు : మహారాష్ట్ర యువత కోసం అందుబాటులో ఉన్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు ఏడాదికోసారి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరింత సమాచారం కోసం అఫిషియల్ వెబ్‌సైట్ : siac.org.inను చూడొచ్చు.

సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అహ్మదాబాద్

గుజరాత్ ప్రభుత్వం ఏప్రిల్ 2013లో సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎస్‌పీఐపీఏ), అహ్మదాబాద్‌ వద్ద సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్ స్టడీ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ క్లాస్ 1-2 సర్వీసులో చేరాలనుకునే గుజరాత్ యువతకు శిక్షణనిస్తారు. కోచింగ్ కోసం ఎటువంటి ఫీజు లేనప్పటికీ లైబ్రరీ డిపాజిట్‌గా రూ.2000, ట్రైనింగ్ డిపాజిట్‌గా రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గుజరాత్‌ నివాసి లేదా ఆ రాష్ట్రం నుంచి ఫస్ట్ డిగ్రీ పొందినవారై లేదా గుజరాత్ మాతృభాష కలిగినవారే ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దరఖాస్తు : అప్లికేషన్ కోసం రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. spipa.gujarat.gov.in వద్ద అప్లై చేసుకోవచ్చు.

జామియా హమ్‌దర్ద్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ, న్యూ ఢిల్లీ

ఈ అకాడమీ.. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. మహిళలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వసతి, క్లాస్ రూమ్ టీచింగ్, ప్రాక్టీస్ సెట్స్, స్టడీ మెటీరియల్స్, 24×7 లైబ్రరీ ఫెసిలిటీ, వైఫై సదుపాయం కల్పిస్తోంది. రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు ఉండగా, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పరీక్షకు ఆహ్వానిస్తారు. టెస్ట్‌లో క్వాలిఫై అయినవారు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. కాగా సెప్టెంబర్ 2021న ప్రవేశాలు ఉండే అవకాశం ఉంది.

ఆల్ ఇండియా కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, చెన్నై

ఇది అన్నా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని ఒక యూనిట్. ఈ సంస్థ ప్రతీ ఏట 325 మంది(225 రెసిడెన్షియల్, 100 నాన్ రెసిడెన్షియల్) ఆస్పిరెంట్స్‌కు ట్రైనింగ్ ఇస్తుండగా.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ కోసం ఫ్రీ కోచింగ్‌, బోర్డింగ్‌తో పాటు ఫుడ్ ఫెసిలిటీని కల్పిస్తోంది. ప్రస్తుతం యూపీఎస్‌సీ నిర్వహించే మెయిన్ ఎగ్జామినేషన్ కోసం 225 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. కాగా ఇప్పటికే మెయిన్స్ క్లియర్ చేసిన వారితో మోడల్ పర్సనాలిటీ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుండటం విశేషం. ప్రత్యేకించి తమిళనాడు యువత కోసమే ఏర్పాటు చేసిన ఈ సంస్థలో శిక్షణ పొందేందుకు ఎంట్రన్స్ టెస్ట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం civilservicecoaching.comను చూడొచ్చు.

యూపీ ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన 2021, ఉత్తరప్రదేశ్

రాష్ట్ర యువతకు పలు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభ్యుదయ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లో శాశ్వత నివాసులైన.. ఆర్థికంగా వెనుకబడిన, బీపీఎల్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కీమ్‌కు అర్హులు. కాగా ఈ పథకం ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో కోచింగ్ ఇస్తున్నారు. ఈ ప్రయోజనాలను పొందాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ abhyuday.up.gov.inలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ, అలీఘర్

ఏఎంయూ మెరిట్ కమ్ ఫ్రీషిప్ ప్రోగ్రామ్ ప్రతీ సంవత్సరం 100 మంది ఆస్పిరెంట్స్‌కు కోచింగ్‌తో పాటు రెసిడెన్షియల్ వసతి కల్పిస్తోంది. ఇది మైనారిటీ, ఎస్సీ, ఎస్టీతో పాటు మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారిత పరీక్ష, కుటుంబ వార్షిక ఆదాయం(ఏడాదికి ఎనిమిది లక్షలకు కన్నా తక్కువ ఉండాలి) ఆధారంగా ఉంటుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మూడు దశల్లో అభ్యర్థులకు అకామిడేషన్, లైబ్రరీ యాక్సెస్‌తో పాటు కోచింగ్ ఫెసిలిటీని అందిస్తుంది. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి ఏఎంయూ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ (TSBCESDTC)

తెలంగాణలో వెనుకబడి తరగతుల(బీసీ)కు చెందిన యువత పోటీ పరీక్షల్లో ఇతరులతో సమానంగా రాణించి, ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బీసీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత శిక్షణనిస్తున్నారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఆర్‌ఆర్‌బీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, డీఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు ట్రైనింగ్‌లో భాగంగా అభ్యర్థులకు స్టైపెండ్, స్టడీ మెటీరియల్/బుక్ గ్రాంట్ అందిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని

వెబ్‌సైట్: http://studycircle.cgg.gov.in/tsbcw/Index.do ద్వారా పొందవచ్చు.

Next Story