- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: యూపీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గ్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలను జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మహిళా ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను మహిళా పోలీసు సిబ్బందికి చెప్పుకునేందుకు వీలుగా గ్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే సీక్రెట్ గ్లాస్ రూం వల్ల మహిళ పోలీసు సిబ్బందితో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
యూపీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గ్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలను జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మహిళా ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను మహిళా పోలీసు సిబ్బందికి చెప్పుకునేందుకు వీలుగా గ్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు.
పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే సీక్రెట్ గ్లాస్ రూం వల్ల మహిళ పోలీసు సిబ్బందితో మహిళా ఫిర్యాదు దారులు ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడటానికి ఉపయోగపడుతుందనీ ఆయన వెల్లడించారు. మహిళ భద్రతను పెంచడానికి మిషన్ శక్తి కార్యక్ర మం ద్వారా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించిదనీ ఆయన తెలిపారు.
Next Story






