పృథ్వీరాజ్ మాత్రమే అలా చేయగలడు.. ‘భాగమతి’ హీరో

by  |
పృథ్వీరాజ్ మాత్రమే అలా చేయగలడు.. ‘భాగమతి’ హీరో
X

దిశ, సినిమా: మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘అంధాదున్’ రీమేక్ చేస్తున్నాడు. ‘బ్రహ్మమ్’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఉన్ని ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రోజు షూటింగ్‌లో జాయిన్ అయిన ఉన్ని ముకుందన్..పృథ్వీరాజ్‌తో ఫస్ట్ స్టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోవడం చాలా చాలా స్పెషల్ అని తెలిపాడు. గతంలో పృథ్వీరాజ్‌తో జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

తను కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో ఓ క్రికెట్ మ్యాచ్ కోసం నటులందరూ గెట్ టు గెదర్ పార్టీకి అటెండ్ కావాల్సి వచ్చిందని..ఈ పార్టీకి హాజరయ్యేందుకు తను ఆటో రిక్షాలో వెళ్లానని తెలిపాడు. పార్టీ పూర్తయ్యేసరికి లేట్ నైట్ కావడంతో అందరూ ఎవరి కార్లలో వారు వెళ్లారని.. తిరిగి ఇంటికి వెళ్లేందుకు వెహికల్ లేని తనను గుర్తించి, కారులో డ్రాప్ చేస్తానని పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రమే ఆఫర్ చేశారని చెప్పాడు. ఆ పెద్ద మనిషి ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాను. కానీ, గుండె నిండా సంతోషంతో బయటకు వచ్చానని తెలిపాడు. పృథ్వీ ఇప్పటికీ అలాగే ఉన్నాడని.. ఫైనల్లీ తనతో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఉన్ని ముకుందన్ ‘భాగమతి’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.



Next Story

Most Viewed