- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవిలో యువతి మృతదేహం లభ్యం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కోటపల్లి ప్రాజెక్టు వెనుక గల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కోట్‌పల్లి మండలం అన్నసాగర్ గ్రామ శివారులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. గుర్తు తెలియని మహిళ (22)ను దారుణంగా హత్యచేసి 4 రోజుల కిందట ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి పాతి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మృతదేహన్ని కుక్కలు బయటకు లాగుతుండగా గ్రామానికి చెందిన కావలి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కోటపల్లి ప్రాజెక్టు వెనుక గల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కోట్‌పల్లి మండలం అన్నసాగర్ గ్రామ శివారులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. గుర్తు తెలియని మహిళ (22)ను దారుణంగా హత్యచేసి 4 రోజుల కిందట ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి పాతి పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ మృతదేహన్ని కుక్కలు బయటకు లాగుతుండగా గ్రామానికి చెందిన కావలి బంట్రోతు గమనించి స్థానిక సర్పంచ్‌కు చెప్పాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా వికారాబాద్ డిఎస్పీ సంజీవరావు, సీఐ మురళి ఘటనా స్థలికి చేరుకొని శవాన్ని వెలికితీసి వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






