PM Modi: వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ఈ బడ్జెట్ రోడ్‌మ్యాప్‌: ప్రధాని మోడీ

by Prasad Jukanti |   (  Updated:2026-02-01 11:42:24  IST  )

కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

PM Modi: వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ఈ బడ్జెట్ రోడ్‌మ్యాప్‌: ప్రధాని మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్-2026 (Union Budget 2026) భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ రూపొందించామని అన్నారు. త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబించిందని చెప్పారు. ఈ బడ్జెట్ లో ఆత్మనిర్భర్ భారత్ కు కేటాయింపులు ఉన్నాయన్నారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ప్రశంసించారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో మరింత ఊతమిచ్చామని భారత్ లోకల్ టు గ్లోబల్ స్థాయికి ఎదిగిందన్నారు. యువశక్తిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉందని, యువతకు గేమింగ్, టూరిజం, క్రీడా సౌకర్యాలు కల్పించబోతున్నట్లు చెప్పారు.

డేటా సెంటర్ హబ్ గా భారత్:

వికసిత్ భారత్ ప్రయాణం వేగవంతానికి ఈ బడ్జెట్ తోడ్పాటుగా ఉంటుందని సంస్కరణలకు బడ్జెట్ నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పారు. భారత్ ను డేటా సెంటర్గా మార్చేందుకు ట్యాక్స్ హాలీడే ప్రకటించామన్నారు. ఈ నిర్ణయం భారత్ ను డేటా సెంటర్ హబ్ గా మారుస్తుందని, ఉద్యోగాల కల్పనకు కేంద్ర బడ్జెట్ మరింత దోహదం చేస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్ నారీశక్తిని ప్రతిబిందిస్తుందని 9 సార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారన్నారు. ఈసారి ఈశాన్య ప్రాంతాల పర్యటకంపై దృష్టి సారించామన్నారు.
Next Story