- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Budget 2026-2027: దివ్యాంగులకు కేంద్రం శుభవార్త
దివ్యాంగులకు కేంద్రం శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: దివ్యాంగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు చేయూతగా నూతన పథకాలు తీసుకొచ్చినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన అనే స్కీమ్‌లు తీసుకొచ్చినట్లు తెలిపారు. మానసిక వ్యాధుల చికిత్సకు నిమ్స్‌హన్స్ ఏర్పాటు చేస్తామని.. రాంచీ, తేజ్‌పుర్‌లలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో పాటు తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కూలీలకు ఉపయోగపడేలా నిధులు మంజూరు చేయబోతున్నట్లు కూడా అధికారికంగా వెల్లడించారు. జాతీయ జలరవాణా కార్యక్రమంలో భాగంగా తూర్పు-పశ్చిమాల అనుసంధానం, వారసత్వం పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నట్లుత తెలిపారు.
Read More..






