Budget2026: స్కూళ్లలోనే 'కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్'.. కేంద్ర బడ్జెట్‌లో AVGC రంగానికి పెద్దపీట

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 06:40:46  IST  )

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు నిర్ణయించింది.

Budget2026: స్కూళ్లలోనే కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్.. కేంద్ర బడ్జెట్‌లో AVGC రంగానికి పెద్దపీట
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమలో 2030 నాటికి సుమారు 20 లక్షల మంది (2 Million) నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉందని అంచనా వేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యార్థి దశ నుంచే వారికి శిక్షణ ఇచ్చేలా భారీ ప్రాజెక్టును ప్రకటించారు. ముంబైలోని 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్' (IICT) సహకారంతో దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ స్కూళ్లు, 500 కాలేజీలలో అత్యాధునిక 'AVGC కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్' ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ నిర్ణయం ద్వారా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు యానిమేషన్, గ్రాఫిక్స్, గేమ్ డిజైనింగ్ వంటి సృజనాత్మక రంగాలలో ప్రయోగాత్మక శిక్షణ లభించనుంది. భారతదేశం కేవలం విదేశీ ప్రాజెక్టులకు సేవలు అందించడమే కాకుండా, సొంతంగా 'క్రియేట్ ఇన్ ఇండియా' బ్రాండ్‌తో ప్రపంచ స్థాయి కంటెంట్‌ను రూపొందించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. పెరుగుతున్న ఓటీటీ (OTT) వినియోగం, గేమింగ్ పట్ల యువత మక్కువను దృష్టిలో ఉంచుకుని, ఈ రంగాన్ని ఒక ప్రధాన ఉపాధి వనరుగా మార్చడానికి ప్రభుత్వం ఈ భారీ పెట్టుబడి పెడుతోంది. ఇది భవిష్యత్తులో భారతీయ యువతను గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీలో అగ్రగామిగా నిలబెట్టనుందని కేంద్ర మంత్రి నిర్మలమ్మ ప్రకటించారు.

Read More..

విదేశీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి 10 శాతానికి పెంపు

Next Story