కేంద్రం సంచలన ప్రకటన.. 2047 వరకూ ట్యాక్స్‌ హాలీడే

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 07:08:05  IST  )

భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.

కేంద్రం సంచలన ప్రకటన.. 2047 వరకూ ట్యాక్స్‌ హాలీడే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 2047 వరకూ డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్‌ హాలీడే ప్రకటించింది. ట్యాక్స్‌ హాలిడే నిర్ణయంతో క్లౌడ్‌ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. సంస్కరణలను పరుగులు పెట్టించే లక్ష్యంతోపాటు అంతర్జాతీయ ఒత్తిడులను, సుంకాలను తట్టుకునే చర్యలకు ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూపొందించినట్లు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కాగా, వరుసగా తొమ్మిదోసారి నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. దీంతో పాటు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Read More..

ట్యాక్స్ పేయర్లకు ఊరట.. ఐటీ రిటర్నుల సవరణ గడువు మార్చి వరకు పెంపు!

Next Story