Budget 2026 : కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను

by Thanuru Gopichand |   (  Updated:2026-02-01 07:11:28  IST  )

కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వాటాదారులకు సంబంధించిన బైబ్యాక్ (Buy Back) పన్ను విధానంలో కీలక మార్పులను ప్రతిపాదించారు.

Budget 2026 : కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను
X

దిశ, వెబ్ డెస్క్ : చిన్న మదుపరుల ప్రయోజనం కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల బైబ్యాక్ పై పన్నులను వడ్డించింది. కార్పొరేటర్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్నును విధించింది.

కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వాటాదారులకు సంబంధించిన బైబ్యాక్ (Buy Back) పన్ను విధానంలో కీలక మార్పులను ప్రతిపాదించారు. కంపెనీలు తమ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియలో జరిగే పన్ను ఎగవేతను (Tax Arbitrage) దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై అన్ని రకాల వాటాదారులకు బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన లాభాలు (Capital Gains) గా పరిగణించి పన్ను విధించనున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ప్రమోటర్లకు బైబ్యాక్ ప్రక్రియపై 22 శాతం పన్ను వర్తించనుండగా, కార్పొరేట్ యేతర (Non-corporate) ప్రమోటర్లకు ఈ పన్ను భారం 30 శాతం వరకు ఉండనుంది. గతంలో కంపెనీలే బైబ్యాక్ పన్నును చెల్లించేవి, కానీ ఇప్పుడు ఆ భారాన్ని గ్రహీతలపైకి మళ్లించడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల ప్రమోటర్లు అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. తద్వారా పన్ను ఎగవేతకు అవకాశం తగ్గుతుంది. పెట్టుబడిదారులు తమ లాభాలను వెనక్కి తీసుకునే క్రమంలో ఈ కొత్త నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్ లావాదేవీలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం నిపుణుల్లో వెల్లడవుతోంది.

Read More..

ట్యాక్స్ పేయర్లకు ఊరట.. ఐటీ రిటర్నుల సవరణ గడువు మార్చి వరకు పెంపు!

Next Story