- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ప్రహ్లాద్ జోషికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ పారాయణంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి, […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.
ప్రహ్లాద్ జోషికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ పారాయణంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు.
Next Story






