- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటోనగర్‌లో గుర్తు తెలియని యువతి హత్య..!
by Batti.Sumithra |
<p>దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని యువతి హత్యకు గురైంది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి (25) మృతదేహం లభ్యమైంది. యువతిని హత్య చేసి శరీర భాగాన్ని గోనెసంచుల్లో కట్టి ఆటోనగర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కాలువ పక్కన పడేశారని తెలిపారు. యువతిని వేరే చోట హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు హంతకులు వాహనాల్లో తీసుకువచ్చి […]</p>

X
దిశ, బోధన్:
నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని యువతి హత్యకు గురైంది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సీఐ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి (25) మృతదేహం లభ్యమైంది. యువతిని హత్య చేసి శరీర భాగాన్ని గోనెసంచుల్లో కట్టి ఆటోనగర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కాలువ పక్కన పడేశారని తెలిపారు. యువతిని వేరే చోట హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు హంతకులు వాహనాల్లో తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని హత్యగా కేసు నమోదు చేసుకుని యువతి ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఈ ఘటన జరిగి రెండు, మూడు రోజుల పైనే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Next Story






