- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని ఎమ్పార్పీ చౌరస్తా దగ్గర సోమవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న అక్కాచెల్లెల్లను గమనించిన కొందరు గుర్తు తెలియని దుండగులు, చెల్లెలు దీపికను కారులో లాక్కెళ్లిపోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నాలుగేళ్ల క్రితం దీపిక అఖిల్ అనే యువకుడ్ని పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని ఎమ్పార్పీ చౌరస్తా దగ్గర సోమవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న అక్కాచెల్లెల్లను గమనించిన కొందరు గుర్తు తెలియని దుండగులు, చెల్లెలు దీపికను కారులో లాక్కెళ్లిపోయారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నాలుగేళ్ల క్రితం దీపిక అఖిల్ అనే యువకుడ్ని పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా పెళ్లైన కొద్దిరోజులకే విడిపోయారు. దీంతో దీపికను భర్తే కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






