- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసిపాప భారమైందా..?
<p>దిశ, వెబ్ డెస్క్ : అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండాలో చోటు చేసుకుంది. పసిపాప భారం అని భావించారో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ ముక్కుపచ్చలారని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు గుడి వెనకాల వదిలి వెళ్లారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ధైర్యపురి తండాలో ముత్యాలమ్మ గుడి వెనకాల మగ శిశువు కనిపించింది. దీంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండాలో చోటు చేసుకుంది. పసిపాప భారం అని భావించారో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ ముక్కుపచ్చలారని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు గుడి వెనకాల వదిలి వెళ్లారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ధైర్యపురి తండాలో ముత్యాలమ్మ గుడి వెనకాల మగ శిశువు కనిపించింది. దీంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సర్పంచ్ బాల్ సింగ్ వైద్య సిబ్బందికి, ఎస్సై కి సమాచారం అందించారు. వెంటనే శిశువుని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి శిశువును వదిలివెళ్లిన వారి వివరాలు సేకరిస్తున్నటు చింతపల్లి ఎస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story






