- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హయత్‌నగర్‌లో మహిళ మృతదేహం కలకలం.. దుప్పట్లో చుట్టి తరలింపు
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన హయత్‌నగర్ సమీపంలోని బాతుల చెరువు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు ఓ మహిళను చంపి, చాపలో చుట్టి చెరువులో పడేసేందుకు తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మహిళ మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో ఈ యువకులే హత్యాచారం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. యువకుల ప్రవర్తన అనుమానంగా ఉండటంతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన హయత్‌నగర్ సమీపంలోని బాతుల చెరువు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు ఓ మహిళను చంపి, చాపలో చుట్టి చెరువులో పడేసేందుకు తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మహిళ మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో ఈ యువకులే హత్యాచారం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. యువకుల ప్రవర్తన అనుమానంగా ఉండటంతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో స్థానికులకు కోపం వచ్చి వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






