ఇంటర్నేషనల్ లెవల్ : ‘లైగర్’ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయని అప్‌డేట్

71
Ligar

దిశ, సినిమా : పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న ‘లైగర్’ మూవీ అప్‌డేట్ అదిరిపోయింది. బిగ్ స్క్రీన్‌పై మ్యాడ్‌నెస్‌కు ప్రామిస్ చేసిన టీమ్.. ఈ ఒక్క అప్‌డేట్‌తో ఇంటర్నేషనల్ లెవల్‌ సినిమా వస్తుందనే హింట్ ఇచ్చింది. హిస్టరీ క్రియేటర్ – అన్‌బీటబుల్ ఐకాన్- వన్ అండ్ ఓన్లీ లెజెండ్ – ది గ్రేట్ ‘మైక్ టైసన్’కు వెల్‌కమ్ చెప్పింది. బాక్సింగ్ గాడ్ టైసన్ ఫస్ట్ టైమ్ ఇండియన్ స్క్రీన్స్‌పై కనిపించబోతుండగా.. ఇందులో బ్యాడెస్ట్ విలన్‌గా నటిస్తున్నాడనే టాక్ వచ్చేసింది. దీంతో ప్రౌడ్ మూమెంట్‌గా ఫీల్ అవుతున్న రౌడీ హీరో ఫ్యాన్స్.. ఇద్దరిని ఒకే స్క్రీన్‌పై చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. కాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రిలీజ్ అవుతున్న ‘లైగర్’ మూవీని కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..