ఉప ఎన్నిక వేళ.. కేసీఆర్ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్ వార్

by  |
ఉప ఎన్నిక వేళ.. కేసీఆర్ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్ వార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గరపడుతున్న క్రమంలో కేసీఆర్ పై నిరుద్యోగులు యుద్ధానికి దిగారు. త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మోసం చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న 1.90 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, నిరుద్యోగులంతా నోటిఫికేషన్ల కోసం చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే విధంగా ఆదివారం మెగా ట్విట్టర్ వార్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా #KcrGiveNotificationsOrResign హ్యాష్ ట్యాగ్‌తో నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వందల కొద్ది ట్వీట్లు, రీట్వీట్లు, ట్యా గ్ లు చేస్తూ ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలోనూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యను ప్రపంచానికి తెలియజేసేలా ట్విట్టర్ వార్‌లు నిర్వహించినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు స్పందించకపోవడం గమనార్హం.


Next Story

Most Viewed