- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఉద్యోగం రాదు.. తీవ్ర మనస్థాపంతో ఓ నిరుద్యోగి..
<p>దిశ, నల్లగొండ: ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఓ నిరుద్యోగి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా కేంద్రంలో స్నేహితులతో కలిసి అద్దె గది తీసుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీలో […]</p>

దిశ, నల్లగొండ: ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఓ నిరుద్యోగి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా కేంద్రంలో స్నేహితులతో కలిసి అద్దె గది తీసుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని.. ఏండ్లుగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాడు. ప్రస్తుతం నిరుద్యోగి సాయి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.






